తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత ? రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు ?

 

రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ రేటు కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి లాక్ డౌన్ సడలింపులు చేయకుండా పగలు అన్ లాక్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.


SCB TODAY





తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. కరోనా కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో.. రాష్ట్రంలో పగటివేళల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అనుకుంటుంది. కరోనా సెకండ్ వేవ్‌తో ప్రారంభంలో నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది.

గత నెల మే 31 నుంచి సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది. అయితే ఈ గడువు బుధవారంతో ముగియనుంది. మరోవైపు ఇదే సయమంలో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 2శాతమే ఉంటోందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ అందించే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నందున.. ఈ నెల 9 తర్వాత పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సడలింపులకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నెల 9 వరకు కరోనా తీవ్రత చాలావరకు తగ్గుతుందని, తగు జాగ్రత్తలతో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చని కేటీఆర్‌ శుక్రవారం టిమ్స్‌ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు.

దీనిని బట్టి లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నందున.. దీనిని సాయంత్రం వరకు పొడిగించి, ఏప్రిల్‌లో విధించినట్టుగానే కేవలం రాత్రిపూట కర్ఫ్యూను మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. మరోవైపు విద్యా సంస్థలు కూడా తెరిచేందుకు అటు అధికారులు సమాయత్తమవుతున్నారు. జూన్‌ 16 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post