తెలంగాణ హరీష్‌రావుకూ ఎన్నో అవమానాలు: ఈటల షాకింగ్ కామెంట్స్

 


హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్‌రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంక్షేమ పథకాలను ఏనాడు వ్యతిరేకించలేదు. వందల కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లకు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పిన. అది చెప్పడం తప్పేలా అవుతుంది? బెంజ్‌ కార్లలో తిరిగేవాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించినా తెలంగాణ జెండా వదలలే. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు కవిత నడుపుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్ రావు పెట్టిస్తే.. కవితకు అప్పగిస్తున్నారు. ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇవి మేము అడుగొద్దా? పెన్షన్‌లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. ధాన్యం కొంటాయ్ అని చెప్పడం తప్పా? రోషం గల బిడ్డను కాబట్టే ఆనాడు టీఆర్ఎస్‌లో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా? నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్ వాలే బాహర్, బాహర్ వాలే అందర్ అన్నట్లుగా ఉంది’’ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.


నాలాగే వాళ్లను కూడా పంపేశారు!

‘’నిన్ను చంపుతా అన్న వారు వచ్చి మీ పక్కన కూర్చున్నారు. నాకు మస్క కొడితే పదవి ఇవ్వలేదు. ఆలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారు. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. నక్సలైట్ అజెండా అని చెప్పిన మీరు వరవరరావును జైల్‌లో పెడితే ఎందుకు మాట్లాడలేదు? మంత్రుల మీదే నమ్మకం లేకపోతే నాలుగు కోట్ల ప్రజలను అడిగే హక్కు ఎక్కడిది? అప్పటి ఒక దళిత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్‌ ఆయనది.. సహాయం అడిగితే చేయొద్దని ఆదేశించారు. ఆ దళిత మాజీ ఎమ్మెల్యే ఎవరో కూడా ఎప్పుడు చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధం’’అని ఈటల పేర్కొన్నారు.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post