దుర్మార్గపు ఆరోపణలు పై ఈటల రాజేందర్

  • నా దగ్గర ఎకరం అసైన్డ్‌ భూమి లేదు... కొనమంటే నేనే వద్దన్నా 

  • అధికారికంగా తీసుకొందామని సీఎంను, నరసింగరావును అడిగా

  • అసైన్‌దారులే 25 ఎకరాలు తహసీల్దారుకు సరెండర్‌ చేశారు
  • ఇప్పటికీ వాళ్ల చేతిలోనే ఉంది.. పథకం ప్రకారమే చానెళ్ల కట్టుకథలు

  • అంతిమ విజయం ధర్మానిదే.. 

  • పదవికన్నా ఆత్మగౌరవమే గొప్పది
  • సిటింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించు.. ప్రభుత్వానికి ఈటల సవాల్‌




ఏరోజైనా ప్రశ్నించే దగ్గరే ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గరలేం. 


ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తే లేదు. 


ఇవాళ నేను ఈ పదవి(మంత్రి) గడ్డిపోచతో సమానం అనను. 


ఇంకో రకంగా కించపరచను. అయితే, నా ఆత్మగౌరవం కంటే ఈ పదవి ముఖ్యం కాదు’ అని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. 


మెదక్‌ జిల్లా మాసాయిపేటలో అసైన్డ్‌ భూములు ఈటల కబ్జా చేసినట్లుగా వివిధ ఛానళ్లలో(ఏబీఎన్‌ కాదు) వచ్చిన కథనాలపై ఆయన శుక్రవారం రాత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


కొన్ని టీవీ చానెళ్లు కట్టుకథలతో, ముందస్తు ప్రణాళికతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. 


ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను సంపాదించుకున్న గౌరవంపై విషం విషం చల్లే ప్రయత్నాల్లో భాగంగా అసైన్డ్‌ భూములను కబ్జా చేసినట్లుగా, షెడ్లు కట్టినట్లుగా కథనాలను ప్రసారం చేశారన్నారు. 


ఏదైనా సంఘటన జరిగితే బాధితులు ఫిర్యాదు చేయాలని, ఇక్కడ అలాంటిదేమీ లేదని ప్రస్తావించారు. 


ఒకేసారి అన్ని టీవీల్లో అత్యంత దుర్మార్గంగా, నీతిబాహ్యంగా, సభ్య సమాజం అసహ్యించుకునే విధంగా కథనాలు ప్రసారం చేశారన్నారు. 


‘ధర్మం తాత్కాలికంగా ఒడిదొడుకులకు గురికావొచ్చు. 

న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్లు కనబడవచ్చు.

 కానీ అంతిమ విజయం ధర్మానిదే. న్యాయానిదే’’ అన్నారు. 

చిల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. 

ప్రజాప్రతినిధిగా ఇరవయ్యేళ్లలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయకుండా బతికానని అన్నారు. ‘‘ఇరవయ్యేళ్లలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఒక్క రూ.10 వేలు తీసుకున్నట్లుగా, వేధించినట్లుగా తేలితే సన్యాసం తీసుకుంటా’’ అని సవాలు విసిరారు. ‘‘ప్రలోభాలు పెట్టి గెలవలేదు. కులం పేరు చెప్పలేదు. మతం పేరు చెప్పలేదు. మానవత్వం పంచిన మనిషిని నేను’’ అన్నారు. తన మొత్తం చరిత్ర మీద దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడైనా తాను తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. 


‘‘ముఖ్యమంత్రి ప్రకటన చూశా. దానిపై సీఎ్‌సతో ఒక కమిటీ, ఏసీబీ డీజీతో మరో కమిటీ వేయాల్సిందే. సిట్టింగ్‌ జడ్జితో కూడా కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నా’’ అన్నారు. తన కోళ్ల ఫారమ్‌లో ఒక్క ఎకరం అసైన్డ్‌ భూమి ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవాలని సవాలు విసిరారు. ‘‘రింగురోడ్డు పేరిట, పరిశ్రమల పేరిట, ఫార్మా పేరిట ఎవరి భూములు తీసుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయో ఎంక్వయిరీ చేయి. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను. ప్రజలకు అనుకూలంగా మాట్లాడతా’’ అన్నారు. ‘‘ఈటల చరిత్ర 20 ఏళ్లుగా ప్రజల కళ్లముందు ఉంది. చెరిపేస్తే చెరిగేది కాదు. మా వేడేందో వాడేందో అందరికీ తెలుసు’’ అన్నారు.


ఆత్మగౌరవం నమ్ముకున్న బిడ్డను నేను


తాను ఆత్మగౌరవాన్ని, శ్రమను, ధర్మాన్ని నమ్ముకున్నానని చెప్పారు. ‘‘2004 నుంచి 2014 దాకా ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని వందల మంది జైళ్లకు పోతే కాపాడుకున్నాం. అడిగిన్రా ఎవ రైనా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని? ఎన్ని లక్షల మందితో మీటింగ్‌ పెట్టినప్పటికీ బువ్వ పెట్టకుండా పంపించిన సందర్భాలు లేవు’’ అని ఈటల గుర్తు చేశారు. ‘‘నిత్యం నా పొయ్యి మండుతూనే ఉంటది. నా కులాన్ని కూడా విమర్శిస్తున్నారు. నేను ముదిరాజ్‌ బిడ్డను. భయపడే బిడ్డను కాను. నా జాతి భయపడే జాతి కాదు. ధైర్యంతో ముందుకు పోయేది. చావనైనా చస్తాం తప్ప లొంగిపోయే జాతి కాదు’’ అని స్పష్టం చేశారు.  ‘‘నా భార్య రెడ్డి. నా కొడుక్కు నిఖిల్‌ అని పెట్టుకున్నా. నా భార్య రెడ్డి యాడ్‌ చేసింది. దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న ఈటల ఎట్లా సంపాదించిండు అని అడుగుతున్నారు. ఇక్కడ వేల కోట్లకు ఎదిగిన వారున్నారు. స్కూటర్‌ మీద వచ్చి, వెయ్యి రెండు వేలకు ఎకరా చొప్పున కొని వందల కోట్లకు ఎదిగారు. ఒకటే జనరేషన్‌లో రూ.100 కోట్లకు అధిపతులైన వారందర్నీ భూములు, ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రశ్నించాలి’’ అన్నారు. 


ఎవరి చరిత్ర ఏందో చెప్పను


ఎవరి చరిత్ర ఏందో తాను చెప్పదలచుకోలేదని, ఇలాంటి కుసంస్కార ప్రచారాలు తగవని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ప్రచారంతో ధర్మాన్ని పాతరేసే ప్రయత్నం చేస్తున్న పెయిడ్‌ చానళ్లను ప్రజలు పాతరేస్తారని హెచ్చరించారు. భూముల వివాదం మీద ముఖ్యమంత్రి విచారణ జరిపించి, సమాజానికి నిజం తెలియజేయాలని కోరారు. ఈటల తన దగ్గర ఏమీ లేనప్పుడు, ఏడుగురే ఉన్నపుడు, అనేక రకాల ప్రలోభాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కొట్లాడుతూనే ఉన్నాడని, దేనికీ లొంగిపోడని స్పష్టం చేశారు.


కొనండి అని వాళ్లే అడిగారు


2016లోనే అత్యాధునిక హేచరీ పెట్టాలని నిర్ణయించుకున్నానని ఈటల చెప్పారు. పూణెలో చదువుకొని వచ్చిన తన కుమారుడిని వేరే ఏ వ్యాపారం పెట్టొద్దని ఒప్పించి, హేచరీ్‌సలోకి తీసుకొచ్చానన్నారు. జమునా హేచరీస్‌ పేరుతో అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఎకరా రూ.6 లక్షల చొప్పున 40 ఎకరాలు కొన్నట్లు తెలిపారు. అందులోనే షెడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరో ఏడెకరాలు కొన్నామని, కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని హేచరీస్‌ ప్రారంభించామని వివరించారు. పౌలీ్ట్రకి ఎరువు పోయడానికి స్థలం అవసరం కావడంతో చుట్టూ ఉన్న అసైన్డ్‌ భూములను కొనడానికి సాంకేతిక సమస్యలు ఉండటంతో పరిశ్రమల శాఖకు లేఖ రాశానన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు. ఆ అసైన్డ్‌ భూములను సేకరించి ఇవ్వాలని కోరానన్నారు. తొండలు కూడా గుడ్లు పెట్టని ఆ భూములను 1994లో అసైన్‌ చేస్తే ఇప్పటిదాకా ఒక్క ఎకరా సాగు కాలేదని వివరించారు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 25 ఎకరాల మేర భూముల యజమానులు సమ్మతించగా ఎమ్మార్వోకు సరెండర్‌ చేశామని చెప్పారు. ఇప్పటికీ అవి వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని, సరెండర్‌ చేసిన భూములను తాను ఆక్రమించినట్లు ఆరోపించడం అత్యంత నీచమన్నారు ‘‘భూములను కొనుగోలు చేయాలని ఆ భూముల వాళ్లే వచ్చి అడిగారు. కొనడం కుదరదని చెప్పి పంపించా. అందుకే, వాటిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేశారు’’ అని వివరించారు. 


నయీం సంపుతా అన్నడు


నయీం లాంటోడు సంపుతానని రెక్కీ నిర్వహిస్తే లెక్కచేయక పోర పో కొడుకా అని చెప్పినోడినని, ఈ ఆస్తి కోసం తప్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘సంక్షేమ హాస్టల్లో బతికా. గడియారాలు, రేమండ్‌ గ్లాసు పెట్టుకునే సోకు లేదు’’ అన్నారు.


కేసీఆర్‌ చెబితే కొనుక్కున్నా


‘‘తమ్మీ ఆల్వాల్‌లో ఉంటే నువ్వు దూరమవుతున్నవు, బంజారాహిల్స్‌లో జాగా కొనుక్కో అని కేసీఆర్‌ అంటే రాములు నాయక్‌ చూపిస్తే రెండు వేల గజాల భూమి 2007లోనే రూ.5 కోట్లు పెట్టి కొన్నా. ఆ భూమి కిరికిరి పడింది. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డిలు కూడా ఈటలకు అన్యాయం జరిగింది అని చెప్పినా... ఆ భూమి ఇవ్వాల్టికీ నాకు చెందలేదు. ఇక శామీర్‌పేటలో నేను ఇల్లు కట్టుకున్న భూమిలోంచి రింగురోడ్డు పోయింది. రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడినా. నీ అలైన్‌మెంట్‌ తప్పు అని చెప్పినా. భూమి కోల్పోయినా ఫర్లేదు. ఆత్మను మాత్రం అమ్ముకోనని రాజశేఖర్‌రెడ్డికి తెగేసి చెప్పినా’’ అని గుర్తు చేసుకున్నారు. నాడు తన పోరాటం వల్లే రింగురోడ్డు మెలికలపై సభాసంఘం వేశారని చెప్పారు. 


2004 నుంచి నా ఆస్తులు చూడండి


తాను 1986 నుంచి కోళ్ల వ్యాపారంలో ఉన్నానని, తానే గుమాస్తాగా, యజమానిగా 50 వేల కోళ్లతో ఫారం పెట్టానని ఈటల గుర్తు చేసుకున్నారు. 1992లో యాంజాల గ్రామానికి వచ్చి ఫామ్‌ను లీజుకు తీసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి 2004 దాకా 10.5 లక్షల కోళ్లతో ఫామ్‌ ఉందని తెలిపారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌ చూస్తే తన ఆస్తులేంటో తెలుస్తాయన్నారు.


ప్రభుత్వం నుంచి ఐదు పైసలూ తీసుకోలే


పరిశ్రమలకు రాయితీలపై పలు కమిటీల్లో తాను సభ్యుడనని ఈటల తెలిపారు. ఎవరికి ఎలాంటి రాయితీ ఇచ్చారో తనకు తెలుసన్నారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలకు రూ.100 కోట్ల రాయితీలు ఇచ్చిన సందర్భాలున్నాయన్నారు. తాను సర్కారు నుంచి ఐదు పైసలు తీసుకున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాలు విసిరారు. రూ.100 కోట్ల రుణం తీసుకునే స్థాయికి తాను కమిట్‌మెంట్‌తో ఎదిగానని, చిల్లరమల్లర బెదిరింపులకు లొంగిపోయేది లేదని అన్నారు. ‘‘ఒక ఇండస్ట్రీకి 30 శాతానికి, 20 శాతానికే భూమి ఇస్తారు. ఒక్క మనిషికి ఉపాధి కల్పిస్తే రూ.20 వేల రాయితీ ఇస్తారు. నాకు రాయితీ అక్కర్లేదు. ఎంత విలువ ఉంటే అంత విలువ చెల్లిస్తా. నాకు ఆ భూమి కావాలి’’ అని సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుకు చెప్పానన్నారు. 


(Topics in covered)

etela rajender

etela rajender cast

etela rajender twitter

etela rajender family

etela rajender house

etela rajender phone number

etela rajender son

etela rajender daughter

etela rajender house address

etela rajender pa

etela rajender pa contact number

etela rajender party

etela rajender biography

etela rajender brother

etela rajender birthday status

etela rajender birthday

etela rajender biography in telugu

etela rajender birthday song mp3 download

etela rajender birthday photos

etela rajender birthday song

etela rajender contact number

etela rajender covid 19

etela rajender comments

etela rajender constituency

etela rajender covid vaccine

etela rajender corona

etela rajender covid

etela rajender hd images

etela rajender hd pics

etela rajender educational qualification

etela rajender email id

etela rajender election affidavit

etela rajender email address

etela rajender family photos

etela rajender facebook

etela rajender family details

etela rajender farmhouse

etela rajender poultry farms

etela rajender poultry farm name

etela rajender goud

etela rajender jobs

etela rajender kulam

etela rajender live

etela rajender mudiraj

etela rajender myneta

etela rajender mla

etela rajender medical college

etela rajender meeting today

etela rajender majority

etela rajender mp3 songs download

etela rajender minister 2019

etela rajender son in law

etela rajender son marriage

etela rajender son name

etela rajender son wife

etela rajender songs

etela rajender songs download

etela rajender son in law name

etela rajender qualifications

etela rajender reddy

etela rajender speech

etela rajender study

etela rajender speech video

etela rajender today news

etela rajender telangana

etela rajender telangana twitter

etela rajender trs

telangana minister etela rajender

etela rajender in telugu

etela rajender and kcr

etela rajender village

etela rajender wife

etela rajender wife cast

etela rajender wiki

etela rajender wikipedia in telugu

etela rajender which vaccine taken

etela rajender daughter wedding

etela rajender son wedding

etela rajender details

etela rajender home

etela rajender profile

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post